Asian Games 2023: రోయింగ్‌లో మెరిసిన భారత్‌.. ఐదు పతకాలు సొంతం..

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల హవా కొనసాగుతోంది.

Update: 2023-09-25 10:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల హవా కొనసాగుతోంది. భారత్ ఖాతాలో పతకాలు డబుల్‌ డిజిట్‌కు చేరాయి. రోయింగ్‌ ఈవెంట్‌ ముగియగా.. టీమిండియా అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 10 పతకాలను భారత అథ్లెట్లు గెలుచుకున్నారు. ఇందులో ఒక స్వర్ణం, మూడు రజతం, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. రోయింగ్‌ ఈవెంట్‌ను భారత్‌ ముగించింది. ఈ విభాగంలో భారత్‌ ఐదు పతకాలను సొంతం చేసుకుంది. మెన్స్‌ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్‌, మెన్స్‌ కాక్స్‌డ్‌ ఎయిట్‌ విభాగాల్లో రజత పతకాలను భారత్‌ గెలుచుకుంది. మెన్స్‌ కాక్స్‌లెస్‌ ఫోర్, మెన్స్‌ కాక్స్‌లెస్‌ పెయిర్‌, మెన్స్ క్వాడ్రపుల్‌ స్కల్స్‌ విభాగాల్లో కాంస్య పతకాలను సొంతం చేసుకుంది.

షూటింగ్‌లోనే తొలి స్వర్ణం..

తొలి స్వర్ణ పతకం అందించిన షూటింగ్‌లోనూ మరో నాలుగు పతకాలు వచ్చాయి. ఇందులో ఒక రజతం, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. మెన్స్‌ 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్ టీమ్‌ రజతం, పురుషుల 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌ టీమ్‌ విభాగంలో కాంస్యం, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళా వ్యక్తిగత విభాగంలో కాంస్యం, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం దక్కింది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ వ్యక్తిగత విభాగంలో విజయ్‌వీర్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.


Similar News