షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్.. కానీ భారత్ మ్యాచ్‌లు ఎక్కడో తెలుసా?
షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్ జరగనుంది. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం దుబాయ్ లో కీలక సమావేశాన్ని నిర్వహించింది.
దిశ, వెబ్ డెస్క్: షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్ జరగనుంది. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం దుబాయ్ లో కీలక సమావేశాన్ని నిర్వహించింది. బీసీసీఐ తటస్థ వేదిక అయితే తప్ప పాకిస్థాన్లో టోర్నీలో ఆడబోమని తేల్చి చెప్పింది. అందుకు పాకిస్థాన్ బోర్డు అంగీకరించ లేదు. ఏసీసీ జోక్యంతో ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు ఆమోదం తెలుపుతూ.. భారత్ ఆడబోయే మ్యాచ్ లను మాత్రం తటస్థ వేదికలపై నిర్వహించాలని ప్రతిపాదించింది.
దీంతో ఆసియా కప్ పాకిస్తాన్ లోనే జరుగుతుంది. కానీ, లీగ్ లో భారత్ ఆడబోయే మ్యాచ్ లు మాత్రం మరో దేశంలో జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు పీసీబీ కూడా అంగీకారం తన ఇప్పటికే తెలిపింది. టోర్నీ మొత్తం పోయే దానికంటే కొన్ని మ్యాచ్ లను వేరే దేశంలో ఆడితే వచ్చే నష్టమేమీ లేదంటూ ఆ బోర్డు భావిస్తుంది. భారత్ ఆడే తటస్థ వేదికలపై ఇప్పటికైతే స్పష్టత లేదు.
పరిశీలనలో యూఏఈ, ఓమన్, శ్రీలంక తో పాటు ఇంగ్లాండ్ దేశలు ఉన్నాయి. శ్రీలంక, ఇంగ్లాండ్, యూఏఈల్లో ఎక్కడో ఓ చోట భారత్ మ్యాచ్ లు ఆడనుంది. అంటే లీగ్ దశ, సూపర్ సిక్స్ దశలో భారత్ తో ఆడబోయే టీంలు తటస్థ వేదికల మీదే తలపడాలి. ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరితే.. తుది పోరు కూడా తటస్థ వేదిక మీదే జరుగనుంది.