Asia Cup 2023: నిప్పులు చెరిగిన పతిరణ.. బంగ్లాపై శ్రీలంక విజయం

ఆసియా కప్‌-2023లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Update: 2023-08-31 16:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 39 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ల వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ.. సమర విక్రమ (54), అసలంక (62) హఫ్ సెంచరీలతో రాణించడంతో లంక విజయాన్ని కైవసం చేసుకుంది. బంగ్లా బౌలర్‌లో షకీబ్ 2, తస్కిన్, షోరిఫుల్, మహెదీ హసన్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్‌లో 164 రన్స్‌కే ఆలౌట్ అయింది. శ్రీలంక యువ బౌలర్ పతిరణ 4 వికెట్లతో చెలరేగగా.. తీక్షణ 2, వెల్లలాగే, శనక, ధనంజయ చెరో వికెట్ తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నజ్యుల్ (89) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ షకీబల్ హసన్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అలాగే వెటరన్ ముష్ఫికర్ రెహ్మాన్ (13), మెహదీ హసన్ మిరాజ్ (5), మెహదీ హసన్ (6), టస్కిన్ అహ్మద్ (0), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (0), షోరిఫుల్ ఇస్లామ్ (2 నాటౌట్) ఒక్కరు కూడా ఆకట్టుకోలేదు. బంగ్లా బ్యాటర్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారంటేనే వారి బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.


Similar News