Shreyas Iyer: శ్రేయస్‌ అయ్యర్‌ ఇంకా కోలుకోలేదు.. బీసీసీఐ ప్రకటన

టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఫిట్‌నెస్‌ సమస్యలు వెంటాడుతున్నాయి.

Update: 2023-09-12 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఫిట్‌నెస్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. సర్జరీ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందిన ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌.. ఆసియా కప్‌-2023 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న అయ్యర్‌.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లే టార్గెట్‌ పూర్తి చేయడంతో అతడికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆఖరి నిమిషంలో అయ్యర్‌ జట్టులో లేడనే వార్త బయటకు వచ్చింది. వెన్నునొప్పి వేధిస్తున్న కారణంగా అతడిని తుదిజట్టు నుంచి తప్పించినట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

ఈ క్రమంలో రాహుల్‌ అద్భుత అజేయ సెంచరీ(111)తో కమ్‌బ్యాక్‌ ఇచ్చి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి శ్రీలంకతో మ్యాచ్‌లో అయ్యర్‌ అందుబాటులోకి వస్తాడు అనుకున్నారు. కానీ వెన్నునొప్పి తగ్గినప్పటికీ పూర్తిస్థాయిలో అయ్యర్‌ కోలుకోలేదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో వారి సూచనలకు అనుగుణంగా శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈరోజు ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో శ్రీలంకతో మ్యాచ్‌ నేపథ్యంలో అతడు జట్టుతో కలిసి స్టేడియానికి వెళ్లడం లేదు’’ అని ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది.

Tags:    

Similar News