Asia Cup 2023 : డ్యూల్ ఫిక్స్‌డ్.. శ్రీలంకలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్
ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఖరారైనట్లు అరుణ్ ధుమాల్ వెల్లడించారు. బీసీసీఐ సెక్రటరీ జే షా పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్‌తో సమావేశమైన తర్వాత ఈ షేడ్యూల్ కన్ఫామ్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఖరారైనట్లు అరుణ్ ధుమాల్ వెల్లడించారు. బీసీసీఐ సెక్రటరీ జే షా పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్‌తో సమావేశమైన తర్వాత ఈ షేడ్యూల్ కన్ఫామ్ చేశారు. ఈ సందర్భంగా ధుమాల్ మాట్లాడుతూ, "పాకిస్తాన్‌లో లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి, ఆ తర్వాత శ్రీలంకలో భారత్-పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లతో సహా తొమ్మిది మ్యాచ్‌లు జరుగుతాయి. ఒకవేళ భారత్, పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరితే మాత్రం మూడో మ్యాచ్ ఉంటుందని తెలిపారు. అయితే అక్టోబర్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ కు ముందు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు కనీసం రెండుసార్లు తలపడే అవకాశంపై ఈ ఏడాది క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఆసియా కప్ 2023 ఈ సారి మంచి ప్రాచుర్యాన్ని పొందనుంది.