Asia Cup 2023: పాకిస్తాన్ vs శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ఆటంకం.. టాస్ ఆలస్యం
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా పడలేదు. పరిస్థితులను చూస్తుంటే ఈ మ్యాచ్ రద్దయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే శ్రీలంకఫైనల్కు చేరుకుంటుంది. పాక్‌తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా లంక ఈ ఛాన్స్ కొట్టేస్తుంది. మరోవైపు పాక్ ఫైనల్‌కు చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఇవాల్టి మ్యాచ్ జరిగి, అందులో పాక్ విజయం సాధించాలి.