Asia Cup 2023: సూపర-4లో బంగ్లాపై పాక్ ఘన విజయం

ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ సూపర్ 4 రౌండ్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

Update: 2023-09-06 16:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ సూపర్ 4 రౌండ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. లాహోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్.. టార్గెట్ చిన్నది కావడంతో ఎక్కడా కంగారుపడకుండా బ్యాటింగ్ చేసింది. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (78), రిజ్వాన్ (63) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్‌లో తస్కిన్, షోరిఫుల్, మెహిదీ హాసన్ తలో వికెట్ తీశారు.


Similar News