Asia Cup 2023: హిట్‌మ్యాన్‌ నయా రికార్డు.. షాహిద్‌ ఆఫ్రిది రికార్డు బద్దలు

Asia Cup 2023లో భాగంగా సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు.

Update: 2023-09-12 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: Asia Cup 2023లో భాగంగా సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్‌ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ సారథి షాహిన్‌ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ శర్మ బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో 16 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

ఆసియా వన్డే కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే..

రోహిత్‌ శర్మ (28)

షాహిద్‌ ఆఫ్రిది (26)

సనత్‌ జయసూర్య (23)

సురేశ్‌ రైనా (18)


Similar News