Asia Cup 2023: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. హిట్‌మ్యాన్‌ మరో అరుదైన రికార్డు..

ఆసియా కప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు.

Update: 2023-09-15 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మెహిది హసన్‌ మీరజ్‌ క్యాచ్‌ (వన్డేల్లో 91వ క్యాచ్‌) పట్టడం ద్వారా, హిట్‌మ్యాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు) 200 క్యాచ్‌ల మార్కును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌కు ముందు 34 మంది ఈ ఘనత సాధించారు. 449 మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్‌ 200 క్యాచ్‌లు ఆందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌ కీపర్‌ కాకుండా) అందుకున్న రికార్డు లంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే 652 మ్యాచ్‌ల్లో మొత్తం 440 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్‌కు ముందు రాహుల్‌ ద్రవిడ్‌ (334), విరాట్‌ కోహ్లి (303), అజహారుద్దీన్‌ (261), టెండూల్కర్‌ (256) లాంటి భారత ఆటగాళ్లు ఉన్నారు.


Similar News