Ravichandran Ashwin : న్యూజిలాండ్‌తో వైట్ వాష్.. ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అశ్విన్
ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్.. భారత్‌ను 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది.
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్.. భారత్‌ను 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. ముంబై టెస్ట్‌లో గెలవడం ద్వారా స్వదేశంలో భారత్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇండియా మూడు విభాగాల్లో పూర్తిగా విఫలం అయింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ అండ్ కో.. కివీస్‌కు ఎక్కడ పోటీ ఇవ్వలేదు. ఈ సందర్భంగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆదివారం తాజా సిరీస్ ఓటమిపై స్పందించాడు. ‘తాము న్యూజిలాండ్‌తో 3-0 తేడాతో ఓడిపోయాం. భారత క్రికెట్ చరిత్రలో గతంలో ఇలా జరగలేదని చదివాను. ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. క్రికెట్ కెరీర్‌లో తాము ఆడేటప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. కానీ న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. కొన్ని సార్లు మనం ఓటమిని చవిచూస్తామని.. అయితే మనమే అజేయులమని అనుకోవడం మొదటి తప్పు అని అశ్విన్ అన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 4 గెలిస్తేనే ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది.