Ashes 2nd Test: స్టేడియంలోకి నిరసనకారులు.. కొద్దిసేపు నిలిచిన మ్యాచ్ (వీడియో)

Update: 2023-06-28 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: యషెస్ సిరీస్‌‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌‌కు నిరసన సెగ తగిలింది. మ్యాచ్ జరుగుతుండగా 'జస్ట్ స్టాప్ ఆయిల్' పేరుతో నిరసనకారులు లార్డ్స్ స్టేడియంలోకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో ప్లేయర్స్ కాస్త కంగారు పడ్డారు. నిరసన కారులు గ్రౌండ్‌లో ఆరెంజ్ పౌడర్ చల్లారు. నిరసనకారుల్లో ఒక్కరిని ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టో బౌండరీ బయటకు ఎత్తుకెళ్లిపోయిరు. దీనివల్ల మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోగా, తిరిగి మళ్లీ ప్రారంభమైంది.

ఇంతకి ఈ ఆందోళనకారులు ఎవరంటే.. 'జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌' అనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలీ కాలంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా ఆందోళనకారులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఆయిల్‌ టర్మినెల్స్‌ను కాపాడాలంటూ 'జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌' పేరుతో ఒక సోషల్‌ యాక్టివిస్ట్‌ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమం కొనసాగిస్తుంది.


Similar News