Ashes 2023: 'నువ్వు ఏడుస్తుంటే టీవీలో చూశామంటూ'.. ఆసీస్ స్టార్‌ బ్యాటర్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఎగతాళి

Ashes 2023 సిరీస్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌కు ఘోర అవమానం జరిగింది.

Update: 2023-06-20 10:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023 సిరీస్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు ఘోర అవమానం జరిగింది. స్టీవ్ స్మిత్‌ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ చేయడానికి వెళ్లగా.. అది కూడా ఆటగాళ్లను ఏడిపిస్తారని బాగా పేరున్న ఎరిక్ హోలీస్ స్టాండ్ వైపు స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. మరి అక్కడ ఉన్న ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఊరికినే కూర్చుంటారా? స్మిత్‌ను చూడగానే రెచ్చిపోయారు. అతన్ని ట్రోల్ చేస్తూ.. పాటలు పాడారు.

'స్టీవ్.. నువ్వు ఏడుస్తుంటే టీవీలో చూశాం' అంటూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ పాటలు పాడారు. దీంతో ఈ పాటతో స్టేడియం అంతా దద్దరిల్లిపోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న ఓలీ రాబిన్సన్‌కు ఇది చూసి నవ్వాగలేదు. అతను బలవంతంగా నవ్వు ఆపుకునే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గతంలో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఆసీస్ టీం బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అలా చేసిన వాళ్లలో స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత క్షమాపణలు చెప్పేందుకు మీడియా సమావేశానికి వచ్చిన స్మిత్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాన్ని గుర్తు చేస్తూనే ఇంగ్లండ్ ఫ్యాన్స్ పాటలు పాడి అతన్ని ఎగతాళి చేశారు.




Similar News