Ashes 2023: యాషెస్‌లో మరో రికార్డు.. ఆ ఫీట్‌ను దాటేసిన స్టీవ్ స్మిత్..
లండన్ వేదికగా లార్డ్స్ స్టేడియంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరో అరుదైన ఘనతను సాధించాడు.
దిశ, వెబ్‌డెస్క్: లండన్ వేదికగా లార్డ్స్ స్టేడియంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరో అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్‌ను స్మిత్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, భారత జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ల పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులను కూడా నమోదు చేశాడు స్టీవ్ స్మిత్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్లో 15,000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 41 మంది ప్లేయర్స్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకోగా.. వారిలో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 53.44 సగటుతో స్మిత్ కంటే కాస్త మెరుగైన యావరేజ్ రేట్‌ను కలిగి ఉన్నాడు. కాగా, స్మిత్ 49.67 సగటుతో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 9 వేల రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
కుమార సంగక్కర (శ్రీలంక)- 172 ఇన్నింగ్స్
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 174 ఇన్నింగ్స్
రాహుల్ ద్రావిడ్ (ఇండియా)- 176 ఇన్నింగ్స్
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 177 ఇన్నింగ్స్
బ్రయాన్ లారా (వెస్టిండీస్)- 177 ఇన్నింగ్స్
సచిన్ తెందూల్కర్ (ఇండియా)- 179 ఇన్నింగ్స్