Ashes 2023: ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ అరుదైన ఘనత.. యాషెస్‌ చరిత్రలో మూడో ప్లేయర్‌గా..

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ అరుదైన ఘనత సాధించాడు.

Update: 2023-06-29 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ అరుదైన ఘనత సాధించాడు. తాజాగా లార్డ్స్‌ వేదికగా మొదలైన రెండో టెస్టులో తొలి రోజే తన బౌలింగ్‌ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ప్రధాన బౌలర్లకు తీసిపోని విధంగా ప్రదర్శన చేసిన రూట్.. ఆసీస్‌ ప్రధాన బ్యాటర్లు కామెరూన్‌ గ్రీన్‌, ట్రెవిస్‌ హెడ్‌లు ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలో రూట్‌ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. యాషెస్‌ చరిత్రలో బ్యాటింగ్‌లో 2 వేల పరుగులు పూర్తి చేయడంతో పాటు 20 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రూట్‌ చరిత్రకెక్కాడు. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌(2172 పరుగులు, 74 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హామండ్‌(2852 పరుగులు, 36 వికెట్లు) పడగొట్టారు.

తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్మిత్‌ 85 పరుగులు నాటౌట్‌ మరో సెంచరీ వైపు దూసుకెళుతుండగా.. అలెక్స్‌ కేరీ 11 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు ట్రెవిస్‌ హెడ్‌(77 పరుగులు), డేవిడ్‌ వార్నర్‌(66 పరుగులు) వన్డే తరహాలో ఆడారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జో రూట్‌, జోష్‌ టంగ్‌లు చెరో 2 వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్‌ 1 వికెట్‌ తీశారు.


Similar News