Ashes 2023: ఆసీస్, ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా

Ashes 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో ఆసీస్ సంచలన విజయం సాధించింది.

Update: 2023-06-21 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో ఆసీస్ సంచలన విజయం సాధించింది. ఆసీస్‌కు కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ (73 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. అతడితో పాటు ఖ్వాజా కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు, ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం బిగ్‌ షాకిచ్చింది. మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మేయింటన్‌ చేసినందుకు ఇరు జట్ల ఆటగాళ్ల ‍మ్యాచ్‌ ఫీజ్‌లో 40 శాతం కొత విధించింది.


Similar News