Ashes 2023 : టాప్​-5లోకి ఆసీస్ స్టార్​ పేసర్​..

Ashes 2023 సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్ అరుదైన మార్క్ అందుకున్నాడు.

Update: 2023-07-02 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023 సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్ అరుదైన మార్క్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి.. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. మిచెల్‌ స్టార్క్ 79 టెస్టుల్లో 315 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే అతడు మాజీ స్పీడ్‌స్టర్‌ మిచెల్ జాన్సన్‌ను అధిగమించాడు. మిచెల్ జాన్సన్​.. 73 టెస్టుల్లో 313 వికెట్లు పడగొట్టాడు. ఈ లిస్ట్​లో స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 145 టెస్టుల్లో 708 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా.. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ 124 టెస్టుల్లో 563 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. నాథన్‌ లయోన్‌ 122 టెస్టుల్లో 496 వికెట్లు తీయగా.. డెన్నిస్‌ లిల్లీ 70 టెస్టుల్లో 355 వికెట్లు పడగొట్టి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.


Similar News