Ashes 2023: ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత..
Ashes 2023 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత సాధించాడు.
దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 62 బంతుల్లో 38 పరుగులు చేసి రాణించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. మూడు సిక్సర్లు బాదడం ద్వారా 1930 నాటి ఓ రికార్డును సమం చేశాడు. యాషెస్ సిరీస్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ పెర్సీ ఛాంప్ మన్ రికార్డును కమ్మిన్స్ సమం చేశాడు. 1930లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఛాంప్ మన్ 3 సిక్సర్లు కొట్టాడు.