కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ సింగ్ సూపర్ గోల్.. లాస్ట్ మినిట్‌లో ఊపిరి పీల్చుకున్న భారత్‌

పారిస్ ఒలంపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు లాస్ట్ మినిట్‌లో ఓటమి నుండి తప్పించుకుంది. చివరి వరకు హోరా హోరీగా సాగిన ఈ గేమ్ 1-1

Update: 2024-07-29 13:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలంపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు లాస్ట్ మినిట్‌లో ఓటమి నుండి తప్పించుకుంది. చివరి వరకు హోరా హోరీగా సాగిన గేమ్‌ను 1-1 స్కోర్లతో డ్రాగా ముగించింది. కాగా, పారిస్ ఒలంపిక్స్‌ హకీ గ్రూప్ స్టేజీలో భాగంగా సోమవారం భారత, అర్జెంటీనా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠగా సాగింది. గెలుపు కోసం భారత్, అర్జెంటీనా జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. మ్యాచ్‌లో మొదట గోల్ చేసిన అర్జెంటీనా చివరి వరకు లీడ్‌ను అలానే కాపాడుకుంది.

దీంతో అంతా భారత్‌కు ఓటమి ఖాయమ అనుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందన్న సమయంలో భారత కెప్టెన్ హర్మీన్ ప్రీత్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. లాస్ట్ మినిట్‌లో గోల్ సాధించి భారత్‌ను ఓటమి నుండి గట్టెక్కించాడు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ చివరి నిమిషంలో చేసిన ఈ గోల్‌తో స్కోర్లు 1-1 సమం అయ్యాయి. దీంతో భారత్, అర్జెంటీనా మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌ను డ్రా గా ముగించుకోవడంతో ఒలంపిక్స్‌లో భారత హకీ జట్టు ముందడుగు వేసింది. ఇండియా తన నెక్ట్స్ మ్యాచును ఐర్లాండ్‌తో తలపడనుంది. 


Similar News