బాత్రూం ఘటనపై అనురాగ్ ఠాకూర్ సీరియస్
యూపీలోని సహరాన్‌పూర్‌లోని ఓ స్టేడియంలో కబడ్డీ క్రీడాకారులకు బాత్రూంలో భోజనాలు వడ్డించన ఘటనపై ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలోని సహరాన్‌పూర్‌లోని ఓ స్టేడియంలో కబడ్డీ క్రీడాకారులకు బాత్రూంలో భోజనాలు వడ్డించన ఘటనపై ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన స్పందించారు. కాంట్రాక్టర్, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. ఇప్పటికే జిల్లా క్రీడా అధికారి అనిమేశ్ సక్సేనాపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది.
ఢిల్లీ
— Chilukuri Srinivas Rao (@Itsmechilukuri) September 20, 2022
మరుగుదొడ్డి నుండి ఆటగాళ్లకు ఆహారం అందించడంపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియస్.
యుపిలోని షాహారన్‌పూర్‌లో రాష్ట్ర క్రీడా పోటీల సందర్భంగా ఘటన
అండర్-17 బాలికల మధ్య జరిగిన కబడ్డీ టోర్నమెంట్