ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్
ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ జోరును కొనసాగిస్తున్నారు. ఈసారి టెన్నిస్ విభాగం మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, రుతుజ భోసలే స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ జోరును కొనసాగిస్తున్నారు. ఈసారి టెన్నిస్ విభాగం మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, రుతుజ భోసలే స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఫైనల్‌లో తైఫీకి చెందిన సంగ్-లియాంగ్ జోడీపై 2-6, 6-3, 10-4 తేడాతో భారత్ విజయం సాధించి గోల్డ్ మెడల్‌ను దక్కించుకుంది. దీంతో భారత్ ఖాతాలోకి తొమ్మిదో స్వర్ణం చేరింది. మరోవైపు షూటింగ్‌లో భారత్ హవా కొనసాగుతోంది. 10మీ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్‌లో.. దివ్యా టీఎస్, సరబ్‌జోత్ సింగ్ జోడి సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్నది. షూటింగ్ విభాగంలో ఇండియాకు ఇది 19వ మెడల్. అన్ని గేమ్స్ కలిపి మొత్తం టీమ్‌ఇండియా 35 పతకాలను సొంతం చేసుకుంది. ఇవాళ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ లో పతకాలు వచ్చే అవకాశం ఉంది.