Andrew Balbirnie: ఐర్లాండ్‌ కెప్టెన్ సంచలన నిర్ణయం..

ఐర్లాండ్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

Update: 2023-07-05 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో ఏడో స్థానం కోసం నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించిన అనంతరం బల్బిర్నీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపాడు.

బల్బిర్నీ తప్పుకోవడంతో క్రికెట్‌ ఐర్లాండ్‌ (సీఐ) పాల్‌ స్టిర్లింగ్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. బల్బిర్నీ మూడు ఫార్మాట్లలో కలిపి 89 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌ కనీసం సూపర్‌ సిక్స్‌ దశకు కూడా చేరలేకపోయింది. ఆ జట్టు గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది.


Similar News