జీవితంలో వచ్చే.. అన్ని దశలను గౌరవించాలి..! విరాట్ కోహ్లీ
జీవితంలో కేవలం విజయాలు వచ్చినప్పుడే పొంగిపోకూడదని.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా, నిబ్బరంగా ఉండాలని అన్నారు క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ.
దిశ, వెబ్ డెస్క్: జీవితంలో కేవలం విజయాలు వచ్చినప్పుడే పొంగిపోకూడదని.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా, నిబ్బరంగా ఉండాలని అన్నారు క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ. జీవితంలో వచ్చే ప్రతీ దశను గౌరవించాలని, దానికోసం నిరంతరం కష్టపడుతూనే ఉండాలని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కోహ్లీ. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న విరాట్.. తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. ఆట, ఫిట్నెస్ తో కెరీర్లో ఎన్నో ఆల్ టైమ్ గ్రేట్స్ విభాగాల్లో చేరినప్పటికీ.. తన స్కై-హై లో భాగంగా తాను కోరుకున్నట్లుగా అన్నీ జరగలేదని తెలిపారు. టెక్నిక్‌పై ఆట తీరును మెరుగుపర్చుకోవడానికి నిరంతరం మార్చుకునే ప్రయత్నం చేశానని, అయితే ఆటలో తనను తాను తిరిగి పొందడానికి, కొంత కాలం క్రికెట్ నుండి విరామం కూడా తీసుకున్నానని అన్నాడు కోహ్లీ. తర్వాత అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మిశ్రమ ఫలితాలను పొందినట్లు చెప్పుకొచ్చాడు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, కోహ్లీ తన కెరీర్‌లో అత్యల్ప దశలో తన పనితీరు మరియు మనస్తత్వం గురించి అంతర్దృష్టిని పంచుకున్నాడు విరాట్ కోహ్లీ.