వింబుల్డన్ ప్రైజ్‌మనీ @ రూ.534 కోట్లు!

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్ ప్రైజ్ మనీని మేనెజ్మెంట్ భారీగా పెంచేసింది.

Update: 2024-06-13 17:20 GMT

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్ ప్రైజ్ మనీని మేనెజ్మెంట్ భారీగా పెంచేసింది. ఈ ఏడాది -2024లో రికార్డు స్థాయిలో సుమారు 50 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో రూ.534 కోట్లు) ప్రైజ్ మనీని టోర్నీ కోసం ఖర్చు చేయనున్నారు. ఇందులో సింగిల్స్ విజేతకు 2.7 మిలియన్ పౌండ్లు దక్కనున్నాయి. ఈ విషయాన్ని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. గతేడాది టోర్నీతో పోలీస్తే ఈసారి ప్రైజ్ మనీ సుమారు 11.9 శాతం పెరిగింది. అనగా సుమారు 5.3 మిలియన్ పౌండ్లు ఎక్కువ అని అధికారులు పేర్కొన్నారు. అయితే, టోర్నీ తొలి రౌండ్‌లోనే ఓడిన ఆటగాడికి 60 వేల పౌండ్లు ఇవ్వనున్నారు. కాగా, టెన్నిస్ క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వింబుల్డన్ గ్రాండ్ స్లమ్ టోర్నీ జూలై 1 న ప్రారంభం కానుండగా.. అదే నెల 14వ తేదీతో ముగియనుంది. కాగా, గతేడాది వింబుల్డన్ గ్రాండ్ స్లమ్ టోర్నీలో మెన్స్ సింగిల్స్ విజేతగా కార్లోస్ అల్కరాజ్.. ఉమెన్స్ సింగిల్స్‌ చాంపియన్‌గా మార్కెట వాండ్రోసోవా నిలిచిన విషయం తెలిసిందే.


Similar News