ఇండియన్ వెల్స్ టైటిల్ అల్కరాజ్‌దే
స్పెయిన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ నం.2 కార్లోస్ అల్కరాజ్ ఇండియన్ వెల్స్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ నం.2 కార్లోస్ అల్కరాజ్ ఇండియన్ వెల్స్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అతను టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో అల్కరాజ్ 7-5(7-5), 6-1 తేడాతో రష్యా ఆటగాడు, 4వ సీడ్ డేనియల్ మెద్వేదేవ్‌ను చిత్తు చేశాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో నెగ్గిన అల్కరాజ్.. రెండో సెట్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచాడు. అనవసర తప్పిదాలతో మెద్వెదేవ్ మూల్యం చెల్లించుకున్నాడు. వరల్డ్ నం.1 నోవాక్ జకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టైటిల్ నిలబెట్టుకున్న రెండో ఆటగాడిగా అల్కరాజ్ ఘనత సాధించాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ వరల్డ్ నం.1, పొలాండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో స్వైటెక్ 6-4, 6-0 తేడాతో 9వ సీడ్, గ్రీక్ క్రీడాకారిణి మరియా సక్కరిపై విజయం సాధించింది. దీంతో స్వైటెక్ కెరీర్‌లో రెండోసారి ఇండియన్ వెల్స్ టైటిల్ నెగ్గింది. 2022లో తొలిసారిగా విజేతగా నిలిచింది.