రోహిత్ తర్వాత టీమిండియాకు బెటర్ కెప్టెన్ అతడే.. ఆకాశ్ చోప్రా

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ - Akash Chopra feels that Rishabh Pant is the best captain after Rohit Sharma

Update: 2022-08-17 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అన్ని ఫార్మాట్‌ల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా ఎవరు ఉంటారు అనే విషయంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఆకాష్‌ చోప్రా తన అభిప్రాయాలను యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకున్నాడు. టీమిండియాకు రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కేఎల్‌ రాహుల్‌ కంటే రిషబ్‌ పంత్‌కే ఉన్నాయని ఆకాష్‌ చోప్రా పేర్కొన్నారు.

ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. టెస్ట్‌ల్లో మాత్రం భారత కెప్టెన్సీ అయ్యే అవకాశాలు రిషబ్‌ పంత్‌కే ఉన్నాయన్నారు. ప్రస్తుతం మూడు ఫార్మాట్‌ల్లో కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా రాహుల్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. రిషబ్ పంత్‌ కెప్టెన్సీ పరంగా దూకుడుగా ఉన్నప్పటికీ బౌలర్లను సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. అందుకే కేఎల్ రాహుల్‌ కంటే రిషబ్ పంత్‌ కాస్త బెటర్‌ అని ఆకాష్‌ చోప్రా పేర్కొన్నాడు.

Tags:    

Similar News