IPL 2025 : మ్యాక్స్‌వెల్‌కు భారీ షాక్.. చెన్నయ్‌తో మ్యాచ్‌లో ఆ నిబంధనను ఉల్లంఘించిన మ్యాక్సీ

చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు.

Update: 2025-04-09 15:08 GMT
IPL 2025 : మ్యాక్స్‌వెల్‌కు భారీ షాక్.. చెన్నయ్‌తో మ్యాచ్‌లో ఆ నిబంధనను ఉల్లంఘించిన మ్యాక్సీ
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో భాగంగా చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా విధించారు. అలాగే, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు. చెన్నయ్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఆర్టికల్ 2.2 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా వికెట్లను తన్నడం, అడ్వర్టైజ్ బోర్డులు, బౌండరీ ఫెన్సింగ్, గ్రౌండ్‌కు సంబంధించిన సామాగ్రిని దుర్వినియోగం చేయడం నేరం. తాను చేసిన నేరాన్ని మ్యాక్స్‌వెల్ అంగీకరించాడని, అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించినట్టు ఐపీఎల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారాడు. చెన్నయ్‌తో మ్యాచ్‌లో అతను ఒకే రన్ చేసి అవుటయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 31 పరుగులే చేశాడు.


Tags:    

Similar News