కౌంటీల్లోకి అజింక్య రహానే..

దిశ,స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.

Update: 2024-06-27 17:01 GMT

దిశ,స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు లీసెస్టర్ షైర్ క్లబ్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ప్రస్తుత రెండో సీజన్ అర్ధభాగంలో అతను జట్టుతో కలవనున్నాడు. కౌంటీ చాంపియన్ షిప్ లో చివరి ఐదు మ్యాచుల్లో రహానే ఆడనున్నట్లు క్లబ్ ప్రకటించింది. అంతేకాకుండా కౌంటీ వన్డే కప్‌లోనూ రహానే ఆడుతారని సమాచారం. వియాన్ ముల్డర్ స్థానంలో 36 ఏళ్ల రహానే ఆడుతారని తెలుస్తోంది. రహానే ఇప్పటివరకు అన్నిఫార్మాట్లలో కలిపి 26 వేల పరుగులు చేయగా.. తన కెరీర్‌లో 51 సెంచరీలు బాదాడు. అతని టాప్ స్కోర్ 265. ఇండియా తరఫున టెస్టుల్లో 8వేల పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు ఉండగా.. కివీస్‌పై అత్యధికంగా 188 పరుగులు సాధించాడు.


Similar News