బీసీసీఐ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ అజయ్ నియామకం

భారత మాజీ క్రికెటర్ అజయ్ రాత్రాను బీసీసీఐ పురుషుల సెలెక్షన్ కమిటీ మెంబర్‌గా నియమించింది.

Update: 2024-09-03 14:35 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ అజయ్ రాత్రాను బీసీసీఐ పురుషుల సెలెక్షన్ కమిటీ మెంబర్‌గా నియమించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీలో సలీల్ అంకోలా స్థానంలో అతన్ని నియమించినట్టు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రస్తుత తరం క్రికెటర్లను గుర్తించడం, వారికి మద్ధతు ఇవ్వడంలో సెలెక్టర్‌గా అజయ్ రాత్రా సెలెక్షన్ కమిటీతో కలిసి పనిచేయనున్నట్టు పేర్కొంది. హర్యానాకు చెందిన 42 ఏళ్ల మాజీ వికెట్ కీపర్ రాత్రా టీమిండియా తరపున 6 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. దేశవాళీలో హర్యానాకు ఆడిన అతను 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4,000 పరుగులు, 240 అవుట్‌లు చేశాడు. అంతేకాకుండా, అసోం, పంజాబ్, ఉత్తరప్రదేశ్ జట్లకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే, గతేడాది సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌కు భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భాగమయ్యాడు. 

Tags:    

Similar News