ముంబైని యూటీ చేసేందుకే పార్లమెంట్ సెషన్ : Nana Patole

ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడమే రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వ్యాఖ్యానించారు.

Update: 2023-09-11 12:49 GMT

ముంబై : ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడమే రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, మణిపూర్‌ హింసాకాండపై చర్చకు కూడా పార్లమెంట్ సెషన్‌ను నిర్వహించని మోడీ.. ఇప్పుడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోందన్నారు.

‘‘ముంబై ఒక అంతర్జాతీయ నగరం. ఇది దేశ ఆర్థిక రాజధాని. ఇక్కడున్న ఎయిరిండియా, ఇంటర్నేషనల్ సర్వీసెస్ సెంటర్, హీరా బజార్ వంటి సంస్థలను ఇతర నగరాలకు తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది’’ అని ఆరోపించారు. ముంబైలో ఉన్న ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలను గుజరాత్‌కు తరలించే యోచనలో కేంద్రం ఉందని నానా పటోలే కామెంట్ చేశారు.


Similar News