ఆ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్‌ తేదీలో మార్పు

ఈ ఏడాది జరగాల్సిన మహిళల ఆసియా కప్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2024-06-25 17:09 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగాల్సిన మహిళల ఆసియా కప్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మంగళవారం షెడ్యూల్‌ను అప్‌డేట్ చేసింది. శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ జూలై 19 నుంచి 28 వరకు జరగనుంది. టోర్నీ తేదీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, పలు మ్యాచ్‌ల తేదీలు మాత్రం మారాయి. దీంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ముందుకు జరిగింది.

మొదట షెడ్యూల్ చేసిన ప్రకారం.. జూలై 21న దాయాదుల పోరు జరగాల్సి ఉండగా.. రెండు రోజులు ముందు అంటే జూలై 19న ఓపెనింగ్ రోజున జరగనుంది. దీంతో పాక్‌తో తలపడటం ద్వారా భారత జట్టు టోర్నీని మొదలుపెట్టనుంది. 21న జరగాల్సి మరో మ్యాచ్ యూఏఈ-నేపాల్ పోరు కూడా ఓపెనింగ్ రోజున నిర్వహించనున్నారు. అలాగే, జూలై 19న జరగాల్సిన భారత్-యూఏఈ మ్యాచ్‌, పాక్-నేపాల్ పోరు జూలై 21వ తేదీకి మార్చారు. జూలై 26న సెమీ ఫైనల్స్, 28న ఫైనల్ జరగనుంది. 


Similar News