పేకాటలో రూ.8కోట్లు పోగోట్టుకున్న ప్రముఖ ఫుట్‌బాలర్

బ్రెజిల్‌ ప్రముఖ ఫుట్‌బాల్‌ స్టార్‌ జూనియర్‌ నెయ్‌మర్‌ ఓ ఆన్‌లైన్‌లో పోకర్‌ గేమ్‌ కోట్లను పోగొట్టుకున్నాడు.

Update: 2023-03-31 14:36 GMT

దిశ, వెబ్ డెస్క్: బ్రెజిల్‌ ప్రముఖ ఫుట్‌బాల్‌ స్టార్‌ జూనియర్‌ నెయ్‌మర్‌ ఓ ఆన్‌లైన్‌లో పోకర్‌ గేమ్‌ కోట్లను పోగొట్టుకున్నాడు. ఒక మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీ ప్రకారరం దాదుపు రూ.8 కోట్లకు పైగా లాస్ అయ్యాడు. గాయంతో గత 3నెలలు సాకర్ కు దూరంగా ఉన్న నెయ్ మర్ ఒక మిలియన్ యూరోలు పోవడంతో కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫ్రాన్స్‌ కేంద్రంగా నడుస్తున్న ఆన్‌లైన్‌ పోకర్‌ గేమ్‌లో మెంబర్‌గా ఉన్న నెయ్‌మర్‌ బుధవారం రాత్రి పేకాట ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో 1 మిలియన్ యూరోలు కోల్పోవాల్సి వచ్చింది. డబ్బులు పోవడంతో నెయ్ మర్ ఏడుస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంది. ఆ తర్వాత తేరుకుని కేవలం సరదా కోసమే ఇలా చేసే అంటూ చెప్పాడు. పోకర్ గేమ్ లో డబ్బులు రావడం, పోవడం కామన్ అని అన్నాడు. నెయ్ మర్ రూ.8 కోట్లు పోయినా భయపడకుండా మళ్లీ పోగొట్టుకున్న సొమ్మును తిరిగి సొంతం చేసుకున్నాడు.

Tags:    

Similar News