రెండో టెస్ట్‌లో Team India ఘన విజయం.. సిరీస్ కైవసం
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్ధేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారు. టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ సైతం విఫలం అయి, 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా ఏమాత్రం నిరాశ చెందకుండా మరోసారి శ్రేయాస్ అయ్యర్, అశ్విన్ ఆదుకున్నారు. మెరుపు ఇన్నింగ్స్‌తో అశ్విన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. భారత బ్యాటర్లలో గిల్(07), కేఎల్ రాహుల్(02), పూజారా(06), కోహ్లీ(01), అక్షర్(34), ఉనద్కక్(13)లు చేతులెత్తేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయాస్(29), అశ్విన్(42) రాణించి టీమిండియాను గెలిపించారు. మొదటి టెస్టుతో పాటు రెండో టెస్టులోనూ గెలిచి బంగ్లాను క్లీన్‌స్విప్ చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 2, హాసన్ మిరాజ్ ఐదు వికెట్ల పడగొట్టారు.

Also Read..