52 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి.. అరుదైన రికార్డు నెలకొల్పిన భారత సంతతి క్రికెటర్

అమెరికా బ్యాటర్, భారత సంతతికి చెందిన మిలింద్ కుమార్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Update: 2024-09-24 18:11 GMT

దిశ, స్పోర్ట్స్ : అమెరికా బ్యాటర్, భారత సంతతికి చెందిన మిలింద్ కుమార్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 155 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో 150-159 మధ్య ఇప్పటివరకు 63 సందర్భాల్లో వ్యక్తిగత స్కోర్లు నమోదయ్యాయి. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో మిలింద్ కంటే ముందు ఎవరూ 155 స్కోరు చేయలేదు.

మ్యాచ్ విషయానికొస్తే..యూఏఈపై అమెరికా 136 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ 4 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. మిలింద్ కుమార్(155 నాటౌట్) భారీ అజేయ శతకంతో రెచ్చిపోగా.. సాయితేజ ముక్కమల్ల(107) కూడా సెంచరీ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ 203 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ చోప్రా(52), అసిఫ్ ఖాన్(51), బసిల్ హమీద్(50) హాఫ్ సెంచరీలతో మెరిసినా అమెరికా బౌలర్లు వరుస వికెట్లతో కట్టడి చేశారు. సౌరభ్ నేత్రావల్కర్(3/32), నోస్తుష్ కెంజిగే(3/36), జస్‌దీప్ సింగ్(2/51) రాణించారు.

ఢిల్లీలో పుట్టిన మిలింద్ కుమార్ భారత దేశవాళీలో ఢిల్లీ, సిక్కిం, త్రిపులకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో అమెరికాకు వెళ్లిన అతను ఈ ఏడాదే యూఎస్ఏ తరపున అరంగేట్రం చేశాడు. అమెరికా జట్టులో మిలింద్‌తోపాటు కెప్టెన్ మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్, సాయితేజ, జస్‌దీప్ సింగ్, స్మిత్ పటేల్ భారత మూలాలు ఉన్న క్రికెటర్లే. 

Tags:    

Similar News