సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఏకంగా 100 కోట్ల మంది ఫాలోవర్లు

పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-09-13 14:25 GMT

దిశ, స్పోర్ట్స్ : పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రొనాల్డో సోషల్ మీడియాలో నయా చరిత్ర సృష్టించాడు. సామాజిక మాధ్యమాల్లో 100 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించాడు. సోషల్ మీడియాలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో చరిత్ర లిఖించాడు.

ఈ విషయాన్ని రొనాల్డో ‘ఎక్స్’ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఫ్యాన్స్‌కు క‌ృతజ్ఞతలు తెలిపాడు. ‘మనం చరిత్ర సృష్టించాం. 1 బిలియన్ ఫాలోవర్స్. ఇది సంఖ్య మాత్రమే కాదు. అంతకుమించిన మీ ప్రేమకు నిదర్శనం. మడైరా వీధుల నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల వరకు నా కుటుంబం కోసం, మీ కోసమే ఆడాను. ఇప్పుడు వంద కోట్ల మంది నాకోసం నిలబడ్డారు. ఇది మన ప్రయాణం. నా ఎత్తుపల్లాల్లో, నా ప్రతి అడుగులోనూ మీరు ఉన్నారు. మనం ఏదైనా సాధించగలమని నిరూపించాం. నన్ను నమ్మినందుకు, నాకు మద్దతుగా ఉన్నందుకు, నా జీవితంలో భాగమైనందుకు ధన్యవాదాలు.’ అని రాసుకొచ్చాడు.

కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోను 63.8 కోట్ల మంది ఫాలోవుతుండగా.. ఎక్స్‌లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇటీవల యూట్యూబ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను 12 గంటల్లోపే కోటి సబ్‌స్కైబర్లను సంపాదించి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం రొనాల్డో యూట్యూబ్ అకౌంట్‌కు 6.8 కోట్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. 

Tags:    

Similar News