తెలంగాణలో ఉమ్మి వేయడంపై నిషేధం
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో ఇకపై బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మివేడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉండటంతో […]
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో ఇకపై బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మివేడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Tags: carona, spit, telangana govt, ban, ts news