ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ‘స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు’
దిశ, తెలంగాణ బ్యూరో: లాక్ డౌన్ సమయంలో, హైదరాబాద్ నగరంలో గతేడాది అకాల వర్షాల సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు, అంధులు, వికలాంగులు, అనాథలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. దీంతో ‘విశ్వగురు అంతర్జాతీయ రికార్డు సంస్థ’ ఈ ఏడాది ‘స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ’ అవార్డుకు ఎంపిక చేసింది. మంగళవారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా సుధీర్ రెడ్డి అవార్డును అందుకున్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: లాక్ డౌన్ సమయంలో, హైదరాబాద్ నగరంలో గతేడాది అకాల వర్షాల సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు, అంధులు, వికలాంగులు, అనాథలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. దీంతో ‘విశ్వగురు అంతర్జాతీయ రికార్డు సంస్థ’ ఈ ఏడాది ‘స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ’ అవార్డుకు ఎంపిక చేసింది.
మంగళవారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా సుధీర్ రెడ్డి అవార్డును అందుకున్నారు. ఇలానే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇంచార్జ్ రమాకాంత్, ఎం ఆర్ డీసీ ఎల్ చైర్మన్ ఓఎస్డీ పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్ పాల్గొన్నారు.