జింక కొమ్ములకు ‘సాలె గూడు’ డెకరేషన్.. ఎక్కడ కట్టాలో తెలీక ఇలా..!
దిశ, వెబ్‌డెస్క్ : భూ మండలంలో అనేక జీవరాశులు తమ మనుగడను సాగిస్తున్నాయి. అయితే, ఒక్కో జంతు జాలానిది ఒక జీవన్మరణ పోరాటమే. క్రూరమృగాల నుంచి శాఖాహారుల వరకు ఒక్కోదానికి ఒక్కొ ఐడెంటిటీ ఉంటుంది. కానీ, సమస్త జీవరాశుల్లో కాస్త విభిన్నమైనది ఎదైనా ఉందంటే అంది ‘సాలీడు’ (Spider) అని చెప్పుకోవచ్చు. దీనికున్న టాలెంట్ యూనిక్. దీనిని పోలిన మరేదైన జీవరాశి ఉండటం కూడా చాలా అరుదు. చెట్లపైన, భవంతులపైన ఎక్కడైనా ఇది మనుగడ సాగిస్తుంది. దొరికిన […]
దిశ, వెబ్‌డెస్క్ : భూ మండలంలో అనేక జీవరాశులు తమ మనుగడను సాగిస్తున్నాయి. అయితే, ఒక్కో జంతు జాలానిది ఒక జీవన్మరణ పోరాటమే. క్రూరమృగాల నుంచి శాఖాహారుల వరకు ఒక్కోదానికి ఒక్కొ ఐడెంటిటీ ఉంటుంది. కానీ, సమస్త జీవరాశుల్లో కాస్త విభిన్నమైనది ఎదైనా ఉందంటే అంది ‘సాలీడు’ (Spider) అని చెప్పుకోవచ్చు. దీనికున్న టాలెంట్ యూనిక్. దీనిని పోలిన మరేదైన జీవరాశి ఉండటం కూడా చాలా అరుదు. చెట్లపైన, భవంతులపైన ఎక్కడైనా ఇది మనుగడ సాగిస్తుంది. దొరికిన కొద్ది స్థలంలో సాలేగూడు నిర్మించుకుని హాయిగా జీవిస్తుంది.
సాలీడు చేసే విన్యాసాల గూర్చి తెలియని వారు ఉండరు. సన్నని దారం మాదిరి వెబ్ వదులతూ పైకి కిందకూ పరుగులు పెడుతుంది. ఇంజినీర్ డిజైన్ చేసిన మాదిరి సులువుగా తన గూడును అల్లెస్తుంది. నాలుగుమూలలా సపోర్టు ఉంటే చాలు ఊయల మాదిరి నెట్ తయారు చేసేస్తుంది. ఇదంతా కొన్ని క్షణాల వ్యవధిలోనే పూర్తి చేస్తుంది. చాలా సందర్భాల్లో సాలీళ్లు చెట్ల మీద లేదా చీకటి గదిలో గూళ్లు కట్టుకుని జీవిస్తుంటాయి. కానీ, ఓ సాలీడు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించింది. రౌటీన్‌గా కాకుండా వెలుతురు పడే ప్రదేశం, అటు ఇటు తిరుగుతూ ఉండే వన్యప్రాణిని ఎంచుకుంది. ఆ గూడును అల్లెందుకు ఎంత టైం తీసుకుందో తెలీదు కానీ, చూపరులను మాత్రం ఆ సాలె గూడు తెగ ఆకట్టుకుంటోంది. అంటిలోప్(జింక) రెండు కొమ్ముల మధ్య దట్టంగా అల్లిన సాలె గూడు దూరం నుంచి చూస్తే ప్లాస్టిక్ కవర్ మాదిరి దర్శనమిస్తోంది.
ప్రస్తుతం జింక కొమ్ముల మధ్య సాలీడు వెబ్‌తో చేసిన గూడును చూపించే చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘‘బోట్స్వానాలోని సెంట్రల్ కలహరి గేమ్ రిజర్వ్ నుండి వచ్చిన చిత్రాలను మార్చి 24న జెస్ ఇస్డెన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈయన పరిరక్షణ పరిశోధన సంస్థ వైల్డ్ సీఆర్క్యూ కోసం పనిచేస్తాడు. తొలుత జింక కొమ్ముల మధ్యలో ప్లాస్టిక్ ఇరుక్కుందని తాను భావించినట్లు.. కానీ అది సాలెగూడు అని తర్వాత తెలిసి ఆశ్చర్యపోయినట్లు’’ వెల్లడించాడు.