ఏపీ అసెంబ్లీలో నువ్వెంత అంటే నువ్వెంత!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టిడ్కో ఇళ్లపై జరిగిన చర్చ సందర్బంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నెలకొంది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని స్పీకర్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే […]

Update: 2020-12-01 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టిడ్కో ఇళ్లపై జరిగిన చర్చ సందర్బంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నెలకొంది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని స్పీకర్‌పై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వెళ్లారు. చంద్రబాబు మాట్లాడే విధానం నేర్చుకోవాలని స్పీకర్ హితవు పలికారు. చంద్రబాబు స్పీకర్ వైపు వేలెత్తి చూపి మాట్లాడటంతో.. మీ బెదిరింపులు, శాపనార్థాలకు భయపడబోమని స్పీకర్ బదులిచ్చారు. మీ వద్ద నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు.

Tags:    

Similar News