యువతకు గుడ్ న్యూస్.. వారికి ఐటీ రంగంలో ప్రత్యేక శిక్షణ.. వివరాల కోసం..
దిశ, తెలంగాణ బ్యూరో : భారీ ఉపాధి అవకాశాలకు వేదిక అయిన ఐటీ రంగంలో అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నూతన అంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను టెక్ నిపుణులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ప్రత్యేకంగా ఒక ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే, ఈ నూతన టెక్నాలజీ రంగంలో శిక్షణ అంటే లక్షల్లో ఫీజులు ఉంటాయి. అందరికీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : భారీ ఉపాధి అవకాశాలకు వేదిక అయిన ఐటీ రంగంలో అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నూతన అంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను టెక్ నిపుణులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ప్రత్యేకంగా ఒక ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే, ఈ నూతన టెక్నాలజీ రంగంలో శిక్షణ అంటే లక్షల్లో ఫీజులు ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండటం కష్టమే.
తెలంగాణ ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని అవకాశాలు కైవసం చేసుకునేందుకు ఇంటర్న్ షిప్ కల్పిస్తూ రూపొందించిన శిక్షణను నవంబర్ 1 నుంచి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) డిజిథాన్‌ను అందిస్తోంది. ఈ కోర్సు ఉత్తీర్ణులైన వారు అమెరికాలోని టాప్ 50 యూనివర్సిటీల్లో ఒక‌్కటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్(యూటీడీ) ద్వారా శిక్షణ పత్రం పొందనున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటర్న్‌షిప్ రంగంలోని అవకాశాలను తెలంగాణ యువత కైవసం చేసుకునేలా ఇంటర్న్‌షిప్ సహిత శిక్షణను టీటా డిజిథాన్ నిర్వహించింది. ఈ శిక్షణ కోసం 50,000లకు పైగా దరఖాస్తులు రాగా, ఇయర్ ఆఫ్ ఏఐ ద్వారా దాదాపు రెండు వేల మందికి శిక్షణ అందించగా యూటీడీ నిర్వహించిన ఎగ్జామ్‌లో 96.7% ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. ఇందులో 80 శాతానికి పైగా అభ్యర్థులకు ప్లేస్‌మెంట్స్ పొందగలిగారు. ఈ శిక్షణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో సైతం ప్రస్తావించి ప్రశంసించారు. ఈ శిక్షణకు కొనసాగింపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై 2021 శిక్షణ అందించనున్నట్లు టీటా డిజిథాన్ ఇప్పటికే ప్రకటించింది.
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆండ్ మెషిన్ లెర్నింగ్ ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్‌షిప్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అందించనున్న శిక్షణ ఈ నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు అక్టోబర్ 29వ తేదీ తుదిగడువు. ఈ శిక్షణలో ఫేస్ రికగ్నిషన్, చాట్ బాట్ ప్రాజెక్టులు చేయనున్నారు. 2020 బ్యాచ్‌లో ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ చేపట్టారు. కొవిడ్ సమయంలో ఏఐ ద్వారా అప్లికేషన్ రూపొందించి మాస్క్ ధరించారా లేదా అనేది గుర్తించారు.
ఇలాంటి అంశాలతో పాటుగా ప్రస్తుత శిక్షణలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంశాల వరకు ఈ శిక్షణ ఉండనుంది. దీంతో పాటుగా ఒక ఇండస్ట్రీ టూర్ సైతం ఉండనుంది. 8 వారాల ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన వారికి అమెరికాలోని టాప్-50 యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ ద్వారా శిక్షణ పత్రం పొందనున్నారు. ఈ శిక్షణకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే, సామాజిక ప్రయోజనాల కోసం టీటా- డిజిథాన్ ద్వారా కేవలం రూ.12,000లకే ఈ శిక్షణ అందించనున్నారు. bit.ly/digithon_academy లింక్ దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 6300368705/ 8123123434/8712360354 లకు సంప్రదించవచ్చు.