అస్సోంలో హిజ్రాలకు స్పెషల్ వ్యాక్సినేషన్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుండగా దేశవ్యాప్తంగా ఒకటి రెండు మినహా అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, కొవిడ్ కేంద్రాలు రోగులతో నిండిపోతున్నాయి. మరోవైపు బెడ్లు, ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేక కొవిడ్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అస్సోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా హిజ్రాలకు స్పెషల్ వ్యాక్సినేషన్ అందించనున్నట్లు హిమంత బిశ్వశర్మ సర్కార్ ప్రకటించింది. రాజధాని గువహటిలో ప్రత్యేకంగా […]

Update: 2021-05-16 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుండగా దేశవ్యాప్తంగా ఒకటి రెండు మినహా అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, కొవిడ్ కేంద్రాలు రోగులతో నిండిపోతున్నాయి. మరోవైపు బెడ్లు, ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేక కొవిడ్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే అస్సోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా హిజ్రాలకు స్పెషల్ వ్యాక్సినేషన్ అందించనున్నట్లు హిమంత బిశ్వశర్మ సర్కార్ ప్రకటించింది. రాజధాని గువహటిలో ప్రత్యేకంగా హిజ్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. దీనిని త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News