నిత్యం ప్రజల సమస్యల గురించే.. నిత్యం ప్రజల్లోనే..
దిశ, మణుగూరు: పినపాక నియోజవర్గంలోని మణుగూరు మండల ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుంటూ ప్రజలలో ఒక్కటై నిలబడుతూ ప్రజల సమస్యలను తీర్చుతున్న వ్యక్తి ఎంపీపీ కారం విజయ కుమారి అని ప్రజలు అంటున్నారు. మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. ప్రజల స్పందన హృదయరాలుగా ముందుకు వచ్చి సమస్యను తీర్చుతుందని ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలకు కష్టం వచ్చిందని తెలిస్తే మన,మంది తేడా లేకుండా ప్రజల కోసమే పని చేస్తుందని చెబుతున్నారు. అనునిత్యం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో […]
దిశ, మణుగూరు: పినపాక నియోజవర్గంలోని మణుగూరు మండల ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుంటూ ప్రజలలో ఒక్కటై నిలబడుతూ ప్రజల సమస్యలను తీర్చుతున్న వ్యక్తి ఎంపీపీ కారం విజయ కుమారి అని ప్రజలు అంటున్నారు. మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. ప్రజల స్పందన హృదయరాలుగా ముందుకు వచ్చి సమస్యను తీర్చుతుందని ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలకు కష్టం వచ్చిందని తెలిస్తే మన,మంది తేడా లేకుండా ప్రజల కోసమే పని చేస్తుందని చెబుతున్నారు.
అనునిత్యం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కూర్చొని ప్రజలకు ఏమి చేయాలి…ప్రజల సమస్య ఏంటో తెలుసుకోవాలనే తపన కలిగిన వ్యక్తి ఎంపీపీ కారం విజయ కుమారి అని ప్రజలు మాట్లాడుతున్నారు. ఒక దేవతలాగా వచ్చి మండలంలో ఎన్ని సమస్యలు ఉన్నా.. నేను ఉన్న అంటూ ప్రజలకు ధైర్యం చెపుతూ ప్రజలను ముందుకు నడిపిస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. ప్రజలంటే పిచ్చి, ప్రజల సేవ అంటే ఆమెకు ప్రాణమని మండల ప్రజలు ఆమెని దేవతలాగా కోలుస్తున్నారని పలువురు మాట్లాడుకుంటున్నారు.
మండల ప్రజా పరిషత్ లో ఏ గ్రామానికి ఇబ్బందులు ఉన్నా.. స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల ద్వారా సమస్య తెలుసుకొని ప్రజల ఇబ్బందులను వెంటనే తీర్చుతుందని మండల ప్రజలు అంటున్నారు. ప్రజలు సమస్యలలో ఇబ్బంది పడుతున్నారంటే.. వెంటనే స్పందించే వారిలో ఎంపీపీ కారం విజయ కుమారి మాత్రమే చూశామని మండల ప్రజలు అంటున్నారు. చిన్న,పెద్ద తేడా లేకుండా అందరు నావాళ్లే, నా కుటుంబమే అని పని చేస్తుందని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. ఇంత వరకు ప్రజలకోసం ఇంత కష్టపడే ఎంపీపీని ఎప్పుడు చూడలేదని ప్రజలే మాట్లాడుకుంటున్నారు.
ప్రజల సొమ్మును ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఆమె సహించదని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆమె అవినీతికి అమడడుగుల దూరంలో ఉంటుందని, మండల ప్రజాపరిషత్ లో అవినీతికి పాల్పడితే వారిని శిక్షించడానికి ఎంత ధైర్యం అయిన చేసే వ్యక్తి ఎంపీపీ అని ప్రజలు ద్వారా తేటతెల్లమవుతోంది. ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చు పెట్టాలని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆమె తపన అని పలువురు నాయకులు ఆమె గురించి మాట్లాడుతున్నారు.
కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలను ఆదుకున్నదని, కరోనాను లెక్కచేయకుండా ప్రతి కుటుంబాన్ని సందర్శించి కరోనా వల్ల ఇబ్బందులు పడ్డ కుటుంబాల విషయాలను ఆమె తెలుసుకున్నదని మండల ప్రజలు అంటున్నారు. ఇలాంటి ఎంపీపీని ఎన్నుకున్నందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని పలువురు నాయకులు ద్వారా తేటతెల్లమవుతోంది.