రామమందిర నిర్మాణంలో కీలక ఘట్టం.. ‘లంక’ పాత్ర
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామమందిరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రామాలయ నిర్మాణం కోసం పెద్దఎత్తున విరాళాలు సేకరించారు. అంతేగాకుండా.. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావించి, పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 15 వందల కోట్లకుపైగా నిధులు సమకూరాయని నిర్వాహకులు వెల్లడించిన సంగతి […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామమందిరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రామాలయ నిర్మాణం కోసం పెద్దఎత్తున విరాళాలు సేకరించారు. అంతేగాకుండా.. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావించి, పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 15 వందల కోట్లకుపైగా నిధులు సమకూరాయని నిర్వాహకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా అయోధ్యలో మందిరం నిర్మించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు.
అంతేగాకుండా.. ఆలయ నిర్మాణం చారిత్మాత్రక ప్రాధాన్యత సంతరించుకునేందుకు రామాయణంలో ప్రాశస్త్యం కలిగిన లంక నుంచి శిలను తీసుకురానున్నారు. లంకాధిపతి రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి బంధించిన చోటుగా రామాయణంలో చెబుతున్న స్థలం(అశోక వనం) నుంచి ఓ శిలను సేకరించి అయోధ్య రామాలయ నిర్మాణానికి అందిస్తామని కొలంబోలోని భారత హైకమిషనర్ కార్యాలయం స్పష్టం చేసినట్టు సమాచారం. రెండు దేశాల మైత్రీబంధానికి ఇది నిదర్శనమన్నారు. సీతా ఎలియాగా పేర్కొంటున్న ప్రాంతం నుంచి సేకరించిన శిలను త్వరలో శీలంక హైకమిషనర్ భారత్‌కు తీసుకురానున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం నిర్మితమవుతున్న రామజన్మభూమి పరిసరాలకు 2-3 కిలోమీటర్ల దూరంలో 1 లక్షా 15 వేల చదరపు అడుగుల అదనపు భూమిని శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసింది.