కరోనా నివారణకు యాదాద్రిలో సుదర్శన హోమం

దిశ, ఆలేరు: యాదాద్రిలో వేకువజామున నుండి సుప్రభాత సేవతో మొదలైన పూజలు, హోమాలు, కళ్యాణం, శ్రావణమాసం తొలిరోజున బాలాలయంలో కరోనా నివారణకు సుదర్శన హోమం నిర్వహించి.. ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా ఆలయ ప్రదాన అర్చకులు శ్రావణ మాసం గురించి తెలిపారు. సనాతన హిందూ ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో ఐదవది మరియు ఎంతో పవిత్రత కల్గినటువంటి మాసం శ్రావణమాసం అని, వర్షపుఋతువులో మొదటి మాసం శ్రావణం. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు […]

Update: 2020-07-21 02:17 GMT

దిశ, ఆలేరు: యాదాద్రిలో వేకువజామున నుండి సుప్రభాత సేవతో మొదలైన పూజలు, హోమాలు, కళ్యాణం, శ్రావణమాసం తొలిరోజున బాలాలయంలో కరోనా నివారణకు సుదర్శన హోమం నిర్వహించి.. ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా ఆలయ ప్రదాన అర్చకులు శ్రావణ మాసం గురించి తెలిపారు. సనాతన హిందూ ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో ఐదవది మరియు ఎంతో పవిత్రత కల్గినటువంటి మాసం శ్రావణమాసం అని, వర్షపుఋతువులో మొదటి మాసం శ్రావణం. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడంవలన ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చిందని వారు చెప్పారు.

Tags:    

Similar News