రైతులకు గుడ్‌న్యూస్.. అడవి జంతువులను పరిగెత్తించే యంత్రాలు
దిశ, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన (సకశేరుక) పక్షులు, జంతువుల నుంచి పంటలను రక్షించుకునే పద్ధతులపై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త వి. వాసుదేవరావు మాట్లాడుతూ.. అడవుల విస్తీర్ణం తగ్గి, ఆహారం లభించక అడవి జంతువులు గ్రామాల బాట పట్టాయన్నారు. వీటి నుంచి పంటలను రక్షించేందుకు యంత్రాల వినియోగం ద్వారా పంటలను రక్షించుకోవచ్చన్నారు. ఇందుకోసం అఖిలభారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం రూపొందించిన […]
దిశ, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన (సకశేరుక) పక్షులు, జంతువుల నుంచి పంటలను రక్షించుకునే పద్ధతులపై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త వి. వాసుదేవరావు మాట్లాడుతూ.. అడవుల విస్తీర్ణం తగ్గి, ఆహారం లభించక అడవి జంతువులు గ్రామాల బాట పట్టాయన్నారు. వీటి నుంచి పంటలను రక్షించేందుకు యంత్రాల వినియోగం ద్వారా పంటలను రక్షించుకోవచ్చన్నారు. ఇందుకోసం అఖిలభారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం రూపొందించిన జీవ ఆర్తనాదం యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
వివిధ రకాల అడవి జంతువుల శబ్దాలను రికార్డు చేసి స్పీకర్ల ద్వారా పంటల సమీపంలో ఏర్పాటు చేయాలి. ఆ శబ్దాలను విని పంటలను ధ్వంసం చేసేందుకు వచ్చే జంతువులు పారిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, శాస్త్రవేత్తలు అనిల్ కుమార్, మధు, శివ కుమార్ స్థానిక ఏడీఏ ప్రవీణ్, వ్యవసాయ అధికారులు నాగరాజు, మురళి, కరుణాకర్ స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్, జఫర్గడ్, రఘునాథపల్లి మండలాల ఏఈఓలు వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ఏఈఓలు వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.