HYD నుంచి మాల్దీవులకు ప్రత్యేక విమాన సర్వీసు..
దిశ, తెలంగాణ బ్యూరో : జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మాల్దీవులలోని మాలేకు డైరెక్టు గో ఎయిర్ విమాన సర్వీసును గురువారం ప్రారంభించింది. ఈ సర్వీసు ఉదయం 11.40 గంటలకు హైదరాబాద్ నుంచి మాలేకు బయలుదేరింది. ఈ విమానం ద్వారా అంతర్జాతీయ సర్వీసులకు ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించింది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, గో ఎయిర్ అధికారులతో పాటు, ఇతర విమానాశ్రయ భాగస్వాములు టెర్మినల్ వద్ద ప్రయాణికులు, సిబ్బందికి వీడ్కోలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మాల్దీవులలోని మాలేకు డైరెక్టు గో ఎయిర్ విమాన సర్వీసును గురువారం ప్రారంభించింది. ఈ సర్వీసు ఉదయం 11.40 గంటలకు హైదరాబాద్ నుంచి మాలేకు బయలుదేరింది. ఈ విమానం ద్వారా అంతర్జాతీయ సర్వీసులకు ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించింది.
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, గో ఎయిర్ అధికారులతో పాటు, ఇతర విమానాశ్రయ భాగస్వాములు టెర్మినల్ వద్ద ప్రయాణికులు, సిబ్బందికి వీడ్కోలు పలికారు. గో ఎయిర్ ఫ్లైట్ G8 1533 ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు మాల్దీవులలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో G8 4033 సర్వీసు మధ్యాహ్నం 2.30 గంటలకు మాలే నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ సర్వీసులు సోమ, మంగళ, గురు, శని.. వారానికి నాలుగు సార్లు ఉండనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, మాలేలను కలిపే ఈ నూతన సర్వీసు కోసం ప్రయాణికులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారన్నారు. అంతర్జాతీయ ప్రయాణానికి ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు.