జూన్ 21 @ స్పెషల్ డే

దిశ, వెబ్‌డెస్క్ : ‘జూన్ 21 – లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్‌’గా మనం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం. ఎందుకంటే.. ఈ రోజు(శనివారం) పగటి సమయం అత్యధికంగా ఉండటమే అందుకు కారణం. 2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. ఇవే కాక ఈ తేదీకి మరిన్ని ప్రత్యేకతలు ఉండటం విశేషం. వరల్డ్ మ్యూజిక్ డే : ప్రతి సంవత్సరం జూన్ 21న ‘వరల్డ్ మ్యూజిక్ డే’ను దాదాపు 120 దేశాల్లో […]

Update: 2020-06-20 07:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘జూన్ 21 – లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్‌’గా మనం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం. ఎందుకంటే.. ఈ రోజు(శనివారం) పగటి సమయం అత్యధికంగా ఉండటమే అందుకు కారణం. 2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. ఇవే కాక ఈ తేదీకి మరిన్ని ప్రత్యేకతలు ఉండటం విశేషం.

వరల్డ్ మ్యూజిక్ డే :

ప్రతి సంవత్సరం జూన్ 21న ‘వరల్డ్ మ్యూజిక్ డే’ను దాదాపు 120 దేశాల్లో జరుపుకుంటారు. ఫ్రాన్స్‌లో ఈ సంప్రదాయం మొదలు కాగా.. అక్కడ ఈ రోజును ‘ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్‌’గా జరుపుకుంటారు. ఫ్రెంచ్ రేడియో స్టేషన్‌లో పనిచేసే అమెరికన్ మ్యూజిషియన్ జోయెల్ కోహెన్.. వేసవి మొదటి రోజును ఆహ్వానిస్తూ ప్రతి సంవత్సరం జూన్ 21న సాయంత్రం ప్రత్యేకంగా పాటలు ప్లే చేసేవాడు. 1982లో ‘ఫ్రాన్స్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్’ దీన్ని అడాప్ట్ చేసుకుంది. అలా మరికొందరి ప్రోత్సాహంతో పారిస్ వీధుల్లో ‘ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్’ 1982లో మొదలైంది. ఆ తర్వాత 1985లో యూరప్‌లోనూ ఈ ఉత్సవాలు మొదలు కాగా, 1997 తర్వాత యూరప్ అవతల కూడా ఈ సంగీతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 120 దేశాలు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.

ఫాదర్స్ డే :

ప్రతి సంవత్సరం 52 దేశాల్లో జూన్ 3వ ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే‌ను గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత ‘ఫాదర్స్ డే’కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.

వరల్డ్ హైడ్రోగ్రఫీ డే :

ప్ర‌తి ఏడాది జూన్ 21న ప్ర‌పంచ హైడ్రోగ్ర‌ఫీ దినోత్స‌వంగా జరుపుకుంటారు. సముద్రాలు, సరస్సులు, నదులు లాంటి జల సంబంధ అంశాలను ‘హైడ్రోగ్రఫీ’ వివరిస్తుంది. 2005లో ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జూన్ 21న‌ ప్ర‌పంచ హైడ్రోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని జ‌రుపుకునే తీర్మానాన్ని ఆమోదించింది. అంత‌ర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ ఆర్గ‌నైజేష‌న్‌(ఐహెచ్ఓ) చొర‌వ‌తో ప్ర‌పంచ హైడ్రోగ్రాఫీ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు.

వీటితో పాటు హ్యండ్ షేక్ డే, వరల్డ్ హ్యుమనిస్ట్ డే, టీ షర్ట్ డేలు కూడా జూన్ 21న కావడం విశేషం. యోగా డే కూడా ఈ రోజు కావడం మరో ప్రత్యేకత.

Tags:    

Similar News