‘90 రోజుల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలి’
దిశ, నిజామాబాద్: రైతుల శ్రేయస్సు కోసం గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలను తోంబై రోజుల్లో పూర్తి చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధ్యక్షతన రైతు వేదికలు, రైతు కల్లాల నిర్మాణానికి సంబంధించి వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలతో బాన్సువాడ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ… రైతుల సమస్యలు నివారించడానికి, రైతులకు సరైన సలహాలు అందించడానికి, రైతులను ఏకీకృతం చేయడానికి […]
దిశ, నిజామాబాద్: రైతుల శ్రేయస్సు కోసం గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలను తోంబై రోజుల్లో పూర్తి చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధ్యక్షతన రైతు వేదికలు, రైతు కల్లాల నిర్మాణానికి సంబంధించి వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలతో బాన్సువాడ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ… రైతుల సమస్యలు నివారించడానికి, రైతులకు సరైన సలహాలు అందించడానికి, రైతులను ఏకీకృతం చేయడానికి రైతు వేదికల నిర్మాణాలు జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.550 కోట్లతో 2604 రైతు వేదికలు నిర్మాణం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి రైతు వేదిక నిర్మాణానికి రూ.10 లక్షలు వ్యవసాయ శాఖ ద్వారా, రూ.12 లక్షలు ఉపాధి పనుల ద్వారా, మొత్తం రూ.22 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. 90 రోజుల్లో రైతు వేదికల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శరత్, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, వ్యవసాయ అధికారులు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.