కరోనాతో స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ మృతి

కోవిడ్-19(కరోనా)వైరస్ సోకి స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా మంగళవారం మృతి చెందాడు. ఇదివరకే లుకేమియా వ్యాధితో బాధపడుతున్న ఫ్రాన్సిస్కో గార్సియాకు ఈ మధ్యే కరోనా వైరస్ సోకింది. దీంతో అతన్నిఐసోలేషన్ సెంటర్ లో ఉంచి వైద్యం అందించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో 21 ఏళ్ల ఫుట్‌బాల్ యువ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా కరోనా వైరస్ తో మరణించినట్టు అట్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ ప్రకటించింది. కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా మృతి చెందడంతో అతని బంధువులు, […]

Update: 2020-03-17 07:54 GMT

కోవిడ్-19(కరోనా)వైరస్ సోకి స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా మంగళవారం మృతి చెందాడు. ఇదివరకే లుకేమియా వ్యాధితో బాధపడుతున్న ఫ్రాన్సిస్కో గార్సియాకు ఈ మధ్యే కరోనా వైరస్ సోకింది. దీంతో అతన్నిఐసోలేషన్ సెంటర్ లో ఉంచి వైద్యం అందించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో 21 ఏళ్ల ఫుట్‌బాల్ యువ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా కరోనా వైరస్ తో మరణించినట్టు అట్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ ప్రకటించింది. కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా మృతి చెందడంతో అతని బంధువులు, స్నేహితులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మున్ముందు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్‌ను రెండు వారాల పాటు వాయిదా వేశారు.

Tags: spanish foot ball coach died, carona virus, lukemiya diseace, 21yrs

Tags:    

Similar News