స్పెయిన్‌లో ఫస్ట్ యువకులకే వైద్యం.. తర్వాతే వృద్ధులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో ఒకటైన స్పెయిన్‌కు కరోనా పేరు చెబితేనే ముచ్చెమటలు పడుతున్నాయి. రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అక్కడి హాస్పిటల్ బెడ్స్ కూడా సరిపోవడం లేదు. దీంతో అక్కడి వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ముందుగా యువకులకే వైద్యం అందించాలని నిర్ణయించారు. 60ఏండ్ల వయస్సు దాటిన వారికి వైద్యం అందించినా, వారు బతికే ఛాన్స్ తక్కువ ఉండటంతో ఈ మేరకు నిర్ణయం […]

Update: 2020-04-05 07:05 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో ఒకటైన స్పెయిన్‌కు కరోనా పేరు చెబితేనే ముచ్చెమటలు పడుతున్నాయి. రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అక్కడి హాస్పిటల్ బెడ్స్ కూడా సరిపోవడం లేదు. దీంతో అక్కడి వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ముందుగా యువకులకే వైద్యం అందించాలని నిర్ణయించారు. 60ఏండ్ల వయస్సు దాటిన వారికి వైద్యం అందించినా, వారు బతికే ఛాన్స్ తక్కువ ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వచ్చే వృద్ధులను కూడా తిరిగి వెనక్కి పంపించేస్తున్నారట. యువకులైతే బతికే అవకాశం ఉండటంతో వారిని మాత్రమే జాయిన్ చేసుకుంటున్నారని సమాచారం. అక్కడి కేర్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కాగా, ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 12,418 చేరినట్టు వైద్యులు అధికారింగా వెల్లడించారు.

Tags: corona, spain, doctors care only youngsters, not old men

Tags:    

Similar News