రైతులకు బేడీలు వేసిన ఘటనపై ఎస్పీ సీరియస్…

దిశ, వెబ్ డెస్క్: రైతులకు బేడీలు వేసిన ఘటనపై గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు కారణమైన పోలీసు అధికారులపై ఎస్పీ కమ్ర శిక్షణ చర్యలను తీసుకున్నారు. ఎస్పీ విశాల్ గున్నీ వివరాల ప్రకారం…నరసరావు పేట ప్రత్యేక మొబైల్ కోర్టు ఉత్తర్వుల మేరకు పలు కేసుల్లో రిమాండ్ ఖైదీలను కరోనా పరీక్షల అనంతరం నరసారావు పేట సబ్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. ఇందుకోసం ఏఆర్ సిబ్బందితో ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. కాగా […]

Update: 2020-10-28 00:52 GMT

దిశ, వెబ్ డెస్క్:
రైతులకు బేడీలు వేసిన ఘటనపై గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు కారణమైన పోలీసు అధికారులపై ఎస్పీ కమ్ర శిక్షణ చర్యలను తీసుకున్నారు. ఎస్పీ విశాల్ గున్నీ వివరాల ప్రకారం…నరసరావు పేట ప్రత్యేక మొబైల్ కోర్టు ఉత్తర్వుల మేరకు పలు కేసుల్లో రిమాండ్ ఖైదీలను కరోనా పరీక్షల అనంతరం నరసారావు పేట సబ్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. ఇందుకోసం ఏఆర్ సిబ్బందితో ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. కాగా వారిని గుంటూరుకు తరలించే క్రమంలో రైతులకు పోలీసులు బేడీలు వేశారు. ఈ విషయం తెలియగానే ఎస్పీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్కార్ట్ విదుల్లో పాల్గొన్న ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఆర్.ఎస్.ఐ, ఆర్.ఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కోసం అదనపు ఎస్పీ (ఏఆర్)స్థాయి అధికారిని విచారణా అధికారిగా నియమించారు.

Tags:    

Similar News